వైసీపీ అక్రమాల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సీనియర్ నేతలతో కమిటీ

వైసీపీ అక్రమాల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సీనియర్ నేతలతో కమిటీ

వైసీపీ నేతల అవినీతిపై మరింత గట్టిగా పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా వివిధ అంశాల్లో వైసీపీ నేతల అక్రమాలు నిగ్గు తేల్చేందుకు పార్టీ సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఇందులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆలపాటి రాజా, వర్ల రామయ్య, అశోక్‌బాబు సభ్యులుగా ఉంటారు. అధికార పార్టీ నేతలపై పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసులు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణల్ని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాలని భావిస్తున్నారు. ఇందు కోసం క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించేందుకు ఏం చేయాలనేదానిపైనా ఫోకస్ పెట్టారు. ఇవాళ మాజీ మంత్రి సోమిరెడ్డి నివాసంలో సమావేశమైన కమిటీ సభ్యులు.. అనేక అంశాలపై చర్చించారు. 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశం జరగాలని, పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడాలని చంద్రబాబు సూచించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story