SHARMILA: అధికారంలోకి వచ్చాక పవన్ వేషం, భాష మారాయ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక పవన్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రాహుల్ గాంధీపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం జోక్‌గా అభివర్ణించారు. పవన్ మత రాజకీయాల్లోకి రాహుల్ గాంధీని లాగడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి వేషం, భాష రెండూ మారాయని పవన్ అన్నారు. లౌకికవాద పార్టీగా ఉన్న జనసేన రైటిస్ట్ పార్టీగా మారిందా? బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ... ఒక మతానికి చెందిన వేషం వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే, ఇతర మతాలకు అభద్రతా భావం ఉండదా అని పవన్‌పై సూటిగా ప్రశ్నలు కురిపించారు. ఎన్నికల్లో మీకు ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా.. ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా అని షర్మిల ప్రశ్నించారు.
త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలోనే అఖిలపక్షంతో వెళ్లి సీఎం చంద్రబాబును కలుస్తామని కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేదని షర్మిల సీరియస్ అయ్యారు. ప్రధాని మోడీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని ఎద్దేవా చేసారు.
మతాన్ని అడ్డుపెట్టుకుంటారా..?
మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే, అదే సిద్ధాంతానికి పవన్ కల్యాణ్ డబుల్ ఏజెంట్ గా మారారని షర్మిల తెలిపారు. గోద్రా, మణిపూర్ లో ఊచకోత కోసింది బీజేపీ కాదా? అలాంటి పార్టీకి మద్దతిస్తున్న మీరు లౌకికవాదం పాటించాలని చెబితే నమ్మమంటారా? అని షర్మిల ప్రశ్నించారు. దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని... అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం తగదు... మీ స్థాయిని దిగజార్చుకోవద్దని షర్మిల స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com