29 Aug 2020 4:14 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తెలుగు మీడియం రద్దును...

తెలుగు మీడియం రద్దును ఉపసంహరించుకోవాలి : తులసిరెడ్డి

తెలుగు మీడియం రద్దును ఉపసంహరించుకోవాలి : తులసిరెడ్డి

గిడుగురామూర్తి తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు కాగా,... ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుగు భాష విధ్వంసకుడిగా తయారు కావడం దురదృష్టకరమన్నారు ఏపి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దుచేసి దానిస్థానంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించడం ఒక చారిత్రక తప్పిదం అన్నారు. తెలుగు భాష తెలుగువారి వారసత్వ ఆస్తి అని, తెలుగును మెరుగుపరిచి భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. తెలుగు మీడియం రద్దును ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • By Admin
  • 29 Aug 2020 4:14 PM GMT
Next Story