గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్

కర్నూలు ఎపీఎస్పీ రెండో బెటాలియిన్‌లో కానిస్టేబుల్ సాల్మన్ రాజు గన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ కానిస్టేబుల్ కడుపులోకి దూసుకెళ్లి.. వీపు వెనుక భాగం నుంచి బయటికి వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోపే సాల్మన్‌రాజు మృతి చెందారు. డీఐజీ బంగ్లా వద్ద గౌరవ వందనం సమర్పించే ప్రిపరేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story