తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
ఏడుకొండలపై వెలసిన ఆ వేంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి.

ఏడుకొండలపై వెలసిన ఆ వేంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. నువ్వు అనుకుంటే ఆయన రప్పించుకుంటేనే వెళ్లగలుగుతావు అని భక్తులు విశ్వసిస్తారు. రోజుకి వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరిస్తారు, మొక్కులు చెల్లిస్తారు. కాలంతో నిమిత్తం లేకుండా 366 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు.

దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించి తరిస్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,254 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.90 కోట్లు వచ్చిందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story