డిక్లరేషపన్‌పై మరోసారి మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

డిక్లరేషపన్‌పై మరోసారి మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

డిక్లరేషన్‌పై తీవ్రస్థాయిలో వివాదం నడుస్తున్న సమయంలో మంత్రి కొడాలి నాని మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.. సడెన్‌గా తిరుమలలో ప్రత్యక్షమైన కొడాలి నాని డిక్లరేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీలోని కొంతమంది వ్యక్తులు వివాదం సృష్టిస్తున్నారంటూ విమర్శించారు.. ప్రధాని మోదీని కూడా సతీసమేతంగా రామాలయానికి వెళ్లి పట్టువస్త్రాలు ఇవ్వమని అడగగలరా అని ప్రశ్నించారు.. యూపీ సీఎం యోగి ఏ భార్యను తీసుకెళ్తారంటూ వ్యాఖ్యానించారు.. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో భార్యతో వచ్చారంటూ చివరకు ఆయన్ను కూడా వివాదంలోకి లాగారు.. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఇలాంటి రాజకీయ డ్రామాలు ఎందుకంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.. నోరుంది కదా అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. డిక్లరేషన్‌ తొలగించాలన్నది తన వ్యక్తి గత అభిప్రాయమని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story