ఏపీలో కొత్తగా 10,526 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 10,526 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,526 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,03,616కి చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 81 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 3,714 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,03,711మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 35,41,321 కరోనా టెస్టుల నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story