స్కూళ్లపై పగబట్టిన కరోనా?

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. కొద్దిరోజులుగా చాపకింద నీరులా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్ఆనయి.. మంచిర్యాల జిల్లాలను వైరస్ వణికిస్తోంది.. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌లో వైరస్ కలకలం రేపుతోంది.. రెండ్రోజుల్లో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. బాధితుల్లో 30 మంది బాలికలు, 14 మంది టీచర్లు, ఆరుగురు పేరెంట్స్, ఇద్దరు వంటవారు ఉన్నారు.. దీంతో పరీక్షల సంఖ్య పెంచారు అధికారులు. 200 మంది విద్యార్థినులకు టెస్టులు కొనసాగుతున్నాయి.. కరోనా కలకలంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.. దీంతో మూడురోజులపాటు స్కూల్‌కు సెలవు ప్రకటించారు అధికారులు.
కామారెడ్డి జిల్లాలోనూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు.. జిల్లాలో ఒక్కరోజే 46 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. దీంతో బాధితుల సంఖ్య 13వేలా 758కి చేరింది.. ఇక హైదరాబాద్‌లోనూ కరోనా బాధితులు పెరుగుతున్నారు.. నాగోల్‌లోని మైనార్టీ బాలికల హాస్టల్‌లో 36 మందికి వైరస్ నిర్ధారణ అయింది.. 184 మందికి పరీక్షలు చేయగా.. 36 మందికి పాజిటివ్‌గా తేలింది.. వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. మిగిలిన వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు కరోనా భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారు.
ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 261 మందికి కరోనా సోకినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.. గుంటూరు జిల్లాలో కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. విశాఖలో 39, చిత్తూరులో 37, కృష్ణా జిల్లాలో 34 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1579కి చేరింది.. 484 యాక్టివ్ కేసులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 214 యాక్టివ్ కేసులతో కృష్ణా జిల్లా రెండోస్థానంలో ఉంది. 193 కేసులతో తూర్పుగోదావరి మూడో స్థానంలో.. 154 కేసులతో గుంటూరు జిల్లా నాలుగో స్థానంలో కొనసాగుతోంది..రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కారణం ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో వైరస్ విజృంభణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కర్నూలు జిల్లాలో సెకెండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. చాప కింద నీరులా కరోనా కేసులు మళ్లీ విస్తరిస్తున్నాయి. తాజాగా కర్నూలులో కరోనాతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా ఓ డివిజన్‌లో పోలీస్ ఉన్నతాధికారి ఒకరు కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు పత్తికొండలో విద్యార్ధులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్కూలు యాజమాన్యం సెలవు ప్రకటించింది. స్థానిక యశోద గార్డెన్ స్కూల్‌లో ఐదోతరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. దీంతో స్కూల్‌ను శానిటైజ్ చేస్తున్నారు.. మూడు రోజులు సెలవు ప్రకటించారు.. అధికారుల ఆదేశాల తర్వాతే స్కూల్‌ను పునఃప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.
అటు చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ఈమాన్విస్ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది.. ఇద్దరు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. వారికి కరోనా నిర్ధారణ కావడంతో స్కూల్ యాజమాన్యం ఉలిక్కడిపింది. స్కూల్‌కు సెలవు ప్రకటించింది. అయితే, గత వారం రోజులుగా కరోనా సోకిన టీచర్లు విద్యార్థులకు క్లాసులు చెప్పడంతో వారిలోనూ ఆందోళన కనబడుతోంది. విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com