ఏపీలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం!

ఏపీలో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ కలకలం రేపుతోంది. గత శనివారం వరకు యూకే నుంచి 12 వందల 16 మంది వచ్చినట్టు అధికారులు లెక్క తేల్చారు. వీరిలో 11 వందల 87 మంది ఆచూకీని అధికారులు గుర్తించారు. యూకే నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా రావడంతో కొత్త టెన్షన్ మొదలైంది. వారి నమనూనాలు మరోసారి తీసుకుని బెంగళూరు, పుణె ల్యాబ్‌లకు పంపనున్నారు. యూకే నుంచి వచ్చినవారిలో గుంటూరులో ఇద్దరు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరిలో పాజిటివ్ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది.
యూకే నుంచి వచ్చిన ఆరుగురికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలవరపెడుతోంది. బాధితుల బంధువుల్లో గుంటూరులో ముగ్గురికి, నెల్లూరు ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్ వైరస్‌తో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. అటు లండన్ నుంచి నెల్లూరు వచ్చిన ప్రయాణికుడిలో స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. గుంటూరు జిల్లాలో వైరస్ సోకిన వారిలోనూ..స్ట్రెయిన్ లక్షణాలున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు ఈ రోజు వచ్చే రిపోర్ట్‌ల ద్వారా తెలియనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com