Sonu Sood : బతికించాలనుకున్నా.. కుదరలేదు.. సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్..!

Sonu Sood : బతికించాలనుకున్నా.. కుదరలేదు.. సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్..!
Sonu Sood : నటుడు సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాగపూర్ నుంచి హైదరాబాదు విమానంలో తీసుకొచ్చిన భారతి అనే అమ్మాయి ఇక లేదని ట్వీట్ చేశారు.

Sonu Sood : నటుడు సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాగపూర్ నుంచి హైదరాబాదు విమానంలో తీసుకొచ్చిన భారతి అనే అమ్మాయి ఇక లేదని ట్వీట్ చేశారు. నెల రోజులుగా ECMO యంత్రంపై ఉండి మృత్యువుతో పోరాడిందని, చివరికి కన్నుమూసిందన్నారు. ఆమెను కాపాడుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. కరోనా బారిన పడిన భారతికి ఇన్ఫెక్షన్ వల్ల 85% ఊపిరితిత్తులు పాడవడంతో 15 రోజుల క్రితం సోనూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపించారు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఆమెను బతికిస్తాననుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

Tags

Next Story