ఏపీ-చత్తీస్ ఘడ్ సరిహద్దులో మావోయిస్టులను కరోనా టెర్రర్..!

ఏపీ-చత్తీస్ ఘడ్ సరిహద్దులో మావోయిస్టులను కరోనా మహమ్మారి వణికిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన గాలికొండ దళం,BKEG దళం, DVC దళం ఏరియా కమిటీ సభ్యులకు కరోనా సోకింది. నిఘా వర్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దళంలోని సభ్యులు కరోనాతో పాటు దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతి లోకి వస్తే ప్రభుత్వం తరఫున ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తమ మొండితనంతో దళ సభ్యులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు. మావోయిస్టు సరైనా నిర్ణయం తీసుకుని పోలీసులను ఆశ్రయిస్తే పునరావాసం కలిపించి ట్రీట్మెంట్ అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com