ఏపీలో కొత్తగా 3,342 మందికి కరోనా

X
ఏపీలో కరోనా కేసులు ఆగేలా లేవు.. గత 24 గంటల్లో 74,919 శాంపిల్స్ ను పరీక్షించగా 3,342 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, గుంటూరు లో నలుగురు, కృష్ణ లో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, కడప లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, విజయనగరం లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 3,572 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,01,131 పాజిటివ్ కేసు లకు గాను 7,63,096 మంది డిశ్చార్జ్ కాగా.. 6,566 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,469గా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
