కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి!

కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి!
కర్నూల్ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ అవినీతి కంపుకొడుతోంది. ఆదోనిలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అడ్డంగా దోచుకుంటున్నారు.

కర్నూల్ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ అవినీతి కంపుకొడుతోంది. ఆదోనిలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అడ్డంగా దోచుకుంటున్నారు. 11వ వార్డు సచివాలయంలో డబ్బులిస్తేనే ఇంటి పట్టాలు ఇప్పిస్తామని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. కనీసం 5 వేలు డిమాండ్ చేస్తున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌, ఆధార్‌ కార్డుల్లో తప్పులున్నాయని, వాటిని సరిచేస్తే ఇళ్ల పట్టాలిస్తామని పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో లబ్దిదారులు, సచివాలయ సిబ్బందితో గొడవ పడుతున్నారు. అయితే అటు టీవీ5 ప్రతినిధిని చూసి లబ్దిదారుల నుంచి డబ్బు తీసుకోకుండానే సచివాలయ సిబ్బంది అక్కడి నుంచి ఉడాయించారు.

Tags

Next Story