Vijayawada Durga Temple : దుర్గగుడిలో అక్రమాలు.. చేతులెత్తేస్తున్న ఈవో..

Vijayawada Durga Temple : విజయవాడ దుర్గగుడిలో ఏం జరుగుతుంది.. అమ్మవారి కానుకలకు భద్రత ఉందా.. 21 గ్రాములకు పైబడిన బంగారు కానుకలకు మాత్రమే.. రశీదు ఇవ్వాలనే రూల్ పెట్టింది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఇక.. ఆలయ సర్వాధికారిణి అయిన ఈవో భ్రమరాంభ.. నోరు విప్పకపోవడంలోని ఆంతర్యమేంటి.. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న కార్యకలాపాలపై ప్రశ్నిస్తే.. ఈవో చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది హాట్ టాపిక్ అయింది.
ఈవోకి తెలియకుండానే దుర్గగుడి కార్యకలాపాలు సాగుతున్నాయా..? ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే దుర్గగుడి కార్యకలాపాలు సాగుతున్నాయా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారి సొమ్మును అడ్డగోలుగా దోచేస్తున్నారనే ఆరోపణలు నిజమేనా..? రాజకీయ నేతలే దోపిడీ దొంగల అవతారమెత్తారా..? అన్న సందేహాలు తలెత్తాయి. దేవాదాయశాఖ నిబంధనలు అమలు చేయలేని నిస్సహాయత దుర్గగుడికే పరిమితమా..? లేక రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పరిస్థితి ఇంతేనా..? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవ విగ్రహాలుగా అధికారులు మారారా..? కమిషనర్ నుంచి ఈవో వరకు అంతా నిస్సహాయులేనా..? అన్న సందేహం కలుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com