వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కర్నూలులోని సి క్యాంప్‌ ప్రభుత్వ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రామాంజనేయులు, ఆయన భార్య రంగమ్మ కుటుంబ ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి నూటికి రెండు రూపాయల చొప్పున అప్పు తీసుకున్నారు. అయితే.. ప్రభుత్వం ఉదోగ్యం ఉందంటూ వడ్డీ వ్యాపారులు నూటికి పది నుంచి 20 రూపాయల చొప్పున నెలకు బలవంతంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. నాలుగేళ్లుగా బెదిరిస్తూ అధిక వడ్డీలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారని.. వేధింపులు తట్టుకలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాశారు.


Tags

Read MoreRead Less
Next Story