CPI: సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన

సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన యాత్ర జరుగుతుంది. పోలవరం చేరుకున్న సీపీఐ బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరంలో సక్రమంగా జరగడం లేదని విమర్శించారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. 72 శాతం పూర్తి అని చెపుతున్నా.. నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని అరోపించారు.పోలవరం ఎత్తు తగ్గించడానికి ప్రభుత్వం లోపాయకారంగా ప్రయత్నాలు చేస్తుంది.పోలవరం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సందర్శన తరువాత నివేదికను రూపొందిస్తామని అన్నారు.
మరోవైపు అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం దారుణమైన చర్య అన్నారు రామకృష్ణ. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ నిర్వీర్యం అయిపోయిందని ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకుంటూ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో నెం.1 నిలుపుదల చేసేవరకు తమ పోరాటం ఆగదని,పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పరిశీలిస్తామన్నారు రామకృష్ణ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com