మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం

అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అక్కడ శాసన రాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని చెప్పటం దుర్మార్గమని అన్నారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో రాజధానికి అంగీకారం తెలిపి, 33 వేల ఎకరాలు అవసరమన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు 10 వేల కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధి ప్రాంతాన్ని ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు. 28 వేల మంది అమరావతి రైతుల ఉసురు తీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, ఇది అత్యంత దారుణమని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story