కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం

కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్ అరెస్టుతో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌తో కొందరు ప్రజాప్రతినిధులకు సంబంధాలు ఉండడం కలకలం రేపుతోంది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఈ పందేలపై నిఘా పెట్టడంతో.. మొత్తం గుట్టు రట్టయ్యింది. ప్రొద్దుటూరు కేంద్రంగా గోవా, బెంగళూరు, హైదరాబాద్‌లో.. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 15 మంది మోస్ట్‌వాంటెడ్ బుకీల్ని అరెస్ట్ చేశారు. ఈ బెట్టింగ్ బ్యాచ్‌కి సహకరించిన పోలీసు అధికారుల పాత్రపై ఇప్పుడు లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఓ ప్రజాప్రతినిధి పాత్రపైనా ఆధారాలు ఉండడంతో ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం.
ఇంటర్నేషనల్ బుకీ నరసింహ అలియాస్ NNN కోసం గాలింపు కొనసాగుతోంది. గత నెల 20న బెంగళూరు, విజయవాడకు చెందిన బుకీలు దాదాపు 500 మందిని స్పెషల్ ఫ్లైట్లలో గోవా తీసుకెళ్లి వాళ్లకు నరసింహ పార్టీ ఇచ్చినట్టు కూడా టాస్క్‌ఫోర్స్ నిర్థారణకు వచ్చింది. దాదాపు 4 కోట్లు ఖర్చుపెట్టి బుకీలకు పార్టీ ఇచ్చాడంటే.. అతని నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు లోతుగా దర్యాప్తు చేస్తే మరింత మంది బుకీలు, నేతల బండారం బయటపడే అవకాశం కనిపిస్తోంది.