Crime: బనగానపల్లెలో ఉద్రిక్తత

Crime: బనగానపల్లెలో ఉద్రిక్తత
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎస్సై శంకర్‌ నాయక్‌, ఏఎస్సై లక్ష్మణ్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్

పోలీసులు మందలించారన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నారు తల్లీకొడుకులు. ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగింది. మృతుల బంధువులు బనగానపల్లె పోలీస్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. శనివారం రాత్రి ఓ అప్పు విషయంలో తల్లి గుర్రమ్మను, కొడుకు దస్తగిరిని పోలీస్టేషన్ పిలిచి మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లీకొడుకులు స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా కుమారుడు దస్తగిరి చికిత్స పొందుతూ మరణించాడు. అతని తల్లి గుర్రమ్మ పరిస్థితి విషమంగా ఉంది.


ఆగ్రహానికి లోనైన బంధువులు స్టేషన్‌ ముందు నిన్న రాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. ఎస్సై శంకర్‌ నాయక్‌, ఏఎస్సై లక్ష్మణ్‌ను సస్పెండ్‌ చేయాలని, రిమాండ్‌కు పంపించాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. బంధువులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌, నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story