Crime: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం

Crime: విశాఖలో  ప్రేమోన్మాది ఘాతుకం
తనతో రావట్లేదని వివాహితపై బ్లేడ్‌తో దాడి

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో రావడానికి నిరాకరిస్తోందని వివాహితపై బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. గత కొంత కాలంగా వివాహితను తన భర్తని వదిలి రావాలని లేదంటే చంపేస్తానని, తన వద్ద ఒక గ్యాంగ్ ఉందని బెదిరించాడు. అయితే అతని చెర నుంచి తప్పించుకున్న మహిళ కుటుంబసభ్యులతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో గాయపడిన వివాహితను ఆసుపత్రికి తరలించారు. బాదితురాలి చేతిపై గాయాలకు 6 కుట్లు వేసి చికిత్స అందించారు. అటు ప్రేమోన్మాది గురించి ఆరా తీయగా అతని పేరు చంద్రశేఖర్ అని, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story