Crime: కొడుకు కాదు కసాయి

Crime: కొడుకు కాదు కసాయి
అక్రమ సంబంధంపై మందలించినందుకు దారుణంగా కన్నతండ్రిని చితకబాదిన కొడుకు

కొడుకు అక్రమ సంబంధంపై ప్రశ్నించినందుకు కన్నతండ్రిపై దాడిచేశాడు ఓ కసాయి కొడుకు. అంతేకాదు వీడియో కాల్ చేసి ప్రియురాలికి చూపిస్తూ కన్న తండ్రిపై పాశవికంగా దాడిచేశాడు.ఈ అమానుష ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపుతోంది. స్థానికంగా నివసిస్తున్న ఢిల్లీ బాబు హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు భరత్ మూటలు మోసే కూలీ, కొద్దిరోజుల కిందట నగరంలోని ఓ మహిళతో గుర్తించిన తండ్రి అతడిని తీవ్రంగా మందలించాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు రెండో పట్టణ పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించారు. తండ్రి తన పట్ల వ్యవహరించిన తీరును అవమానంగా భావించాడు. భరత్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తన తండ్రిపై దాడి చేస్తానని చెప్పాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో ఢిల్లీబాబుకు తీవ్రంగా రక్తస్రావమైంది. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.

Tags

Read MoreRead Less
Next Story