Crime : ముంబైలో అదృశ్యమైన బాలుడు ఎన్టీఆర్‌ జిల్లాలో లభ్యం

Crime : ముంబైలో అదృశ్యమైన బాలుడు ఎన్టీఆర్‌ జిల్లాలో లభ్యం
శిల్ప అనే మహిళ ద్వారా.. షేక్‌ నాగుల్‌ మీరా, షహనాబేగం దంపతులకు 2 లక్షలకు అమ్మినట్లు విచారణలో వెల్లడైంది

ముంబైలో అదృశ్యమైన బాలుడి ఆచూకి ఎన్టీఆర్‌ జిల్లాలో లభ్యమైంది. గతేడాది ఫిబ్రవరి 5న బాలుడు తప్పిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గాలింపు చేపట్టారు. అయితే.. 13 నెలల తర్వాత విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన శ్రావణిరంజిత్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు.

జగ్గయ్యపేటకు చెందిన శిల్ప అనే మహిళ ద్వారా.. షేక్‌ నాగుల్‌ మీరా, షహనాబేగం దంపతులకు 2 లక్షలకు అమ్మినట్లు విచారణలో వెల్లడైంది. బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసులో ప్రధాన నిందితురాలు శ్రావణిరంజిత్‌ను ముంబై తీసుకెళ్లారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story