Crime: కారులో కట్టేసి, నిప్పుపెట్టి, లోయలోకి తోసి... వ్యక్తి సజీవదహనం

X
By - Chitralekha |4 April 2023 3:55 PM IST
సోదురుడి అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని వ్యక్తిని కాల్చి చంపిన యువతి తరఫు బంధువులు...
పెళ్లైన యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న సోదరుడిని వారించినందుకు ఓ వ్యక్తిని సజీవంగా తగలబెట్టిన వైనం చిత్తూరులో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలో రామచంద్రాపురానికి చెందిన నాగరాజుగా గుర్తించారు. అతడి సోదరుడు పురుషోత్తమ్, అప్పటికే పెళ్లైన రిపుంజయతో ప్రేమ వ్యవహారం నడుపుతుండటంపై నాగరాజు ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే పురుషోత్తంతో యువతి సంబంధాన్ని వ్యతిరేకిస్తున్న ఆమె బంధువులు చర్చల నిమిత్తం నాగరాజును రమ్మని పిలిచారు. కారులో నాగరాజును ఎక్కించుకుని గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారు. కారులోనే అతడిపై దాడి చేసి, తాళ్లతో కట్టేశారు. అనంతరం కారుకు నిప్పుపెట్టి కొండపై నుంచి తోసే ప్రయత్నం చేశారు. అయితే కొండ దిగువకు వస్తోన్న కారుకు రాయి అడ్డుపడటంతో మధ్యలోనే ఆగిపోయింది. ఇది గమనించిన స్థానికులు కారును ఆపి నాగరాజును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు పూర్తిగా వ్యాపిచడంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు వచ్చినప్పటికీ అప్పటికే కాలిన గాయాలతో నాగరాజు మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com