Accident: కాసేపట్లో పెళ్లి..ఇంతలో ఘోరం

X
By - Subba Reddy |27 Jan 2023 11:30 AM IST
ప్రమాదానికి గురైన పెళ్లి వాహనం; నలుగురు మృతి...
పల్నాడు జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి మండపానికి వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా వరుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. పెళ్లి మండపానికి వెళ్తుండగా ఉప్పలపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. లారీని బలంగా ఢీకొనడంతో కారు నుజ్జునజ్జు అయింది. దీంతో కారు లోపల ఉన్నవారంతా అందులోనే ఇరుక్కుపోయారు. అక్కడున్నవారు కారు డోర్లను గుణపాలతో తొలగించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com