CRIME: అల్లుడితో పెళ్లికి అత్త సిద్ధం.. కూతురును చంపేందుకు ప్లాన్

రోజురోజుకూ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. వావీ వరసలు లేకుండా అక్రమసంబంధాలు పెట్టుకొని అడ్డొచ్చిన వారిని కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. అల్లుడిని పెళ్లాడేందుకు ఒక మహిళ ఏకంగా కన్న కూతుర్నే కడతేర్చాలనుకుని చివరకు కటకటాలపాలైంది. కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలుడు, బాలిక ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. బాధితురాలి తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి తమతోనే కలిసి ఉంటుంది. అయితే భర్త చనిపోవడంతో 40 ఏళ్ల వయస్సున్న అత్త, 18 ఏళ్ల అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో అల్లుడిని పెళ్లి చేసుకోవాలని అత్త నిర్ణయించుకుంది. ఒక రోజూ ఇంట్లోనే అత్త-అల్లుడు పెళ్లికి సిద్ధమయ్యారు. దీనికి అడ్డు వచ్చిన బాలికపై రోకలి బండతో దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఇంట్లో నుంచి అరుపులు,కేకలు వినిపించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానికులు, తీవ్రగాయాలతో పడిన ఉన్న బాలికను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అత్తా, అల్లుడిని చితకబాధి పోలీసులకు అప్పగించారు.
తల్లి మందలించిందని గొంతు కోసి హతమార్చిన కొడుకు
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, శ్రీరామ్ నగర్లో దారుణం జరిగింది. తల్లి లక్ష్మీదేవి (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు) మందలించిందని కుమారుడు యశ్వంత్‌రెడ్డి (బీటెక్ పూర్తి చేశాడు) ఆమెతో గొడవపడి, ఆగ్రహంతో కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఆ సమయంలో తండ్రిని గదిలో బంధించాడు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఆరంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com