VSP: జగన్ హయాంలో మూడు మర్డర్లు.. ఆరు కిడ్నాప్‌లు

ఉత్తరాంధ్ర అంటే ప్రశాంతతకు మారుపేరు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అది గత చరిత్రగా మారిపోయింది. విశాఖ అంటే ఇప్పుడు మూడు మర్డర్లు.. ఆరు కిడ్నాప్‌లు గా మారిపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆకు రౌడీల నుంచి కిడ్నాపర్లకు అడ్డాగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. విశాఖలో శాంతిభద్రతలు బాగా ఉన్నాయని రౌడీలందర్నీ ఏరి పారేశామని ఏపీ డీజీపీ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అలా లేవు. సాగర తీర వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారన్నది గణాంకాలు చెపుతున్న వాస్తవం. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల అంశంపై తెరపైకి వచ్చిన నాటి నుంచి భూకబ్జాదారులు రెచ్చి పోతున్నారు. కన్నుపడ్డ భూములను చేజిక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. దానికి సామాన్యుడు.. ప్రజాప్రతినిధి అన్న తేడా లేదు.. అందరూ బాధితులే అన్నట్లు ఉంది విశాఖ పరిస్థితి.
ఇక సాగర తీరంలో లా అండ్ ఆర్డర్‌పై డీజీపీ ఇచ్చిన భరోసా విశాఖలో ఎవరికీ పెద్దగా ధైర్యం ఇచ్చినట్లుగా లేదు.ప్రజాప్రతినిధులు,వీఐపీలు,సెలబ్రిటీలు ఇలా కాస్త డబ్బున్న వారంతా తమకు గన్ లైసెన్స్ ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గన్ లైసెన్స్ ల కోసం ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నట్లుగా పోలీసులు అంటున్నారు.విచిత్రం ఏమిటంటే.. తనకూ గన్ లైసెన్స్ కావాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నట్లుగాసమాచారం. ప్రభుత్వ భద్రతలో ఉండే అమర్నాత్ ఇలా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్ తర్వాత ఎక్కువ సెక్యూరిటీ ఉండే మంత్రుల్లో అమర్నాథ్ కూడా ఒకరు.ఆయనకు ఇప్పటాకే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది ప్రభుత్వం. అయినా తనను తాను రక్షించుకోవడానికి అసాంఘిక శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించుకోవడానికి గన్ లైసెన్స్‌కి అప్టై చేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు విశాఖలో ఏకంగా అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేయడంతో వీఐపీలు అలెర్ట్ అయ్యారు.తమను తాము రక్షించుకునేందుకు ఓ ఆయుధం కావాలని గుర్తుచ్చిందో ఏమో కాని బిజినెస్, పొటిలికల్ సెలబ్రిటీలు గన్‌లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన కుమారుడు శరత్ గన్ లైసెన్స్ కోసం ఇప్పటికే సీపీకి దరఖాస్తు చేసుకున్నారు.తమపై భవిష్యత్తు లోనూ దాడులు జరిగే అవకాశముందని భావించిన ఎంపీ తమకు లైసెన్స్ కావాలని అడిగారట.పోలీసులు కూడా వారికి ఇదే చెప్పారట. వీరితోపాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే గన్ లైసెన్స్ జారీ చేయాలంటే పోలీస్ శాఖతోపాటు స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ఎన్‌ఓసీ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం విశాఖ నగర పరిధిలో 600 మందికి గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. అందులో 400 మందికిపైగా మాజీ సైనికులే. వీరంతా బ్యాంకులు, ఇతర సంస్థల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మరో 150 నుంచి 200 మంది వరకూ రాజకీయ, వ్యాపార ప్రముఖులకు గన్ లైసెన్సులు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com