CRIME: రాజమండ్రిలో తల్లీకూతురు దారుణ హత్య

CRIME: రాజమండ్రిలో తల్లీకూతురు దారుణ హత్య
X
ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల అనుమానం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో తల్లీ కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. హుకుంపేట వాంబే కాలనీలో జరిగిన ఈ ఈ హత్యలతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏలూరుకు చెందిన ఎండీ సల్మా (38), ఆమె కుమార్తె సానియా (16)ను ఓ యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. హత్య జరిగిన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. బంధువుల్లో ఒకరు వచ్చి ఇంటి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కిటికీలోంచి లోపలికి చూడగా మృతదేహాలు కనిపించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. సానియాను ప్రేమించిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాదులో లైట్​మెన్​గా పనిచేసే శివకుమార్ అనే యువకుడు సానియాతో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది. సానియా మరొకరితో చాటింగ్‌లో ఉండడంతో భరించలేక శివకుమారే ఈ జంట హత్యలకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శివకుమార్‌ను రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద పొదల్లో దాక్కొని ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

Tags

Next Story