ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో రెండు రోజులపాటు వర్షాలు

ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో రెండు రోజులపాటు వర్షాలు
X
దీని ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని

శ్రీలంకలోని ట్రింకోమైలకు 710 కి.మీ. దూరంలో, తమిళనాడులోని కన్యాకుమారికి 1120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్న బురేవీ తుఫాన్ కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఎఫెక్ట్ ఏపీని కూడా తాకింది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ట్రోపో ఆవరణ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో నెల్లూరులో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బురేవీ సైక్లోన్ కారణంగా తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వారం రోజులుగా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో తిరుమల వాసులు చలికి వణికిపోతున్నారు.

Tags

Next Story