ఏపీకి మరో తుఫాన్‌ గండం : వాతావరణ శాఖ

ఏపీకి మరో తుఫాన్‌ గండం : వాతావరణ శాఖ

ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నివర్‌తో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి మరో తుఫాన్‌ గండం పొంచి ఉందని హెచ్చరించింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తం ఏర్పడింది. దీని ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తదుపరి 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారి మరింత బలపడుతుందని... డిసెంబర్‌ 2న తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీలో కోస్తా, రాయలసీమలో వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

డిసెంబర్‌ 2, 7న మరో రెండు తుఫాన్‌లు వచ్చే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. మరో నాలుగురోజులు పాటు ఏపీలో పలు చోట్ల వర్షాలు పడతాయన్నారు. పత్తి, వరి కోతదశలో మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల వరికోతను నిలిపివేశారు.

Tags

Read MoreRead Less
Next Story