రాజధాని కేసులపై నేటి నుంచి హైకోర్టులో రోజువారీ విచారణ

రాజధాని కేసులపై  నేటి నుంచి హైకోర్టులో రోజువారీ విచారణ

అమరావతి రాజధాని అంశంపై.. ఇవాళ్టి నుంచి హైకోర్టులో రోజు వారీ విచారణ జరగనుంది. అంశాల వారిగా పిటీషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. హైబ్రిడ్‌ సిస్టం ద్వారా ఢిల్లీ నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. విశాఖలో గెస్ట్ హౌస్‌ నిర్మాణం కోర్టు ధిక్కరణపై సీఎస్‌ సంతకంతో కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో ధర్మానం ఆదేశించింది. దీనికి ప్రభుత్వం సమయం కోరింది. ఈ నేపథ్యంలో.... హైకోర్టులో రోజు వారి విచారణ జరుగుతుండటంతో.. తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story