రాజధాని అమరావతి కేసులపై రోజువారీ విచారణ

X
రాజధాని అమరావతికి సంబంధించిన కేసులపై రోజువారీ విచారణ జరగనుంది. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ పై నేడు పూర్తివివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. కమీషనరేట్ లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని గతంలో ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించగా.. వాటి వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో నేడు ఆయా వివరాలను ప్రభుత్వం సమర్పించనుంది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుల కూర్పుకు సంబంధించిన ఫైళ్లను కూడా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించనుంది. అటు మండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన అనంతర పరిణామాలపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వేసిన పిటిషన్ పై కూడా నేడు ప్రభుత్వం స్పందించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
