ఏపీని పట్టిపీడిస్తున్న డేంజరస్‌ వైరస్‌ జగన్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీని పట్టిపీడిస్తున్న డేంజరస్‌ వైరస్‌ జగన్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీని పట్టిపీడిస్తున్న డేంజరస్‌ వైరస్‌ జగన్‌ అంటూ నిప్పులు చెరిగారు.. టీడీపీ సీనియర్‌ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.. ఫేక్‌ న్యూస్‌నే నిజాలుగా నమ్మించడంలో జగన్‌ ఘనుడన్న చంద్రబాబు.. కుల, మత విద్వేషాలు రగిలించడంలో ఆరితేరాడంటూ ఫైరయ్యారు.

పేరు మోసిన క్రిమినల్స్‌తో కేసులు పెట్టించడం, వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి మంచివాళ్లపై బురద చల్లడం వైసీపీ నాయకులకు నిత్యకృత్యంగా మారిందన్నారు.. కేంద్ర మంత్రి పేరుతో మోసగించిన వ్యక్తితో కేసులు వేయిస్తాడు.. పేకాట దందాలు నడిపే వారితో కేసులు వేయిస్తాడంటూ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు చంద్రబాబు.. క్రిమినల్స్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Tags

Next Story