DASARA: తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి

DASARA: తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి
X

దే­శ­వ్యా­ప్తం­గా విజయ దశమి సం­బ­రా­లు అం­గ­రంగ వై­భ­వం­గా జరు­గు­తు­న్నా­యి. తె­లు­గు రా­ష్ట్రా­లు దసరా పం­డు­గ­శోభ సం­త­రిం­చు­కు­న్నా­యి. దే­శ­వ్యా­ప్తం­గా దసరా వే­డు­క­లు ప్ర­తి ఒక్క­రు అత్యంత భక్తి శ్ర­ద్ద­ల­తో జరు­పు­కుం­టు­న్నా­రు. చె­డు­పై మంచి వి­జ­యం సా­ధిం­చి­నం­దు­కు ప్ర­తీ­క­గా ఈ పండగ చే­సు­కుం­టా­రు. దసరా పం­డ­గ­కు చాలా ప్ర­త్యే­క­లు­న్నా­యి. మహి­షా­సు­రు­డి­ని శ్రీ­దు­ర్గా­దే­వి సం­హ­రిం­చ­డం.. తే­త్రా­యు­గం­లో రా­వ­ణు­డి­పై యు­ద్ధం­లో శ్రీ­రా­ము­డు గె­ల­వ­డం.. మహా­భా­ర­తం­లో వి­రాట పర్వం­లో పాం­డ­వు­లు అజ్జాత వాసం ము­గి­య­డం­తో.. జమ్మి చె­ట్టు­పై ఉన్న ఆయు­ధా­ల­ను ఆర్జు­ను­డు కిం­ద­కి దిం­ప­డం.. తది­తర సం­ఘ­ట­న­ల­న్నీ ఈ దసరా పర్వ­ది­నం రోజే చోటు చే­సు­కు­న్నా­య­ని పె­ద్ద­లు పే­ర్కొం­టా­రు. దసరా పండగ రోజు.. ప్ర­జ­లు తమ మన­స్సు­లో­ని చె­డు­ను వి­డి­చి­పె­ట్టి మంచి మా­ర్గా­న్ని అను­స­రిం­చా­ల­ని శా­స్త్ర పం­డి­తు­లు చె­బు­తు­న్నా­రు.

దసరా పండుగ వేళ దైవిక స్త్రీశక్తి స్వరూపంగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారిని పూజించడం వల్ల రక్షణ, బలం, జ్ఞానం లభిస్తాయని బలంగా నమ్ముతారు. దసరా నవరాత్రులు వచ్చాయంటే దుర్గాదేవి నామస్మరణలో మునిగిపోతారు. కొంత మంది భక్తులు దుర్గాదేవి మాల సైతం ధరిస్తారు. జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొందేలా చేయమని అమ్మవారిని వేడుకుంటూ.. దుర్గాదేవి మంత్రాలు పఠిస్తారు.

. ‘విజయ ముహూర్తం’ ఎప్పుడు? ఏం చేయాలంటే..

విజయ దశమి రోజంతా మంచిదే అయినప్పటికీ.. ఇందులో విజయ ముహూర్తం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. 2025 అక్టోబర్‌ 2న విజయ ముహూర్తం మధ్యాహ్నం 2.10గంటల నుంచి 2.58గంటల వరకు ఉంది. ఈ 48 నిమిషాల కాలం ఎంతో బలమైనది. ఎంతో శక్తిమంతమైన ఈ ముహూర్తంలో ఏ కొత్త ఆలోచన చేసినా, ఏ కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

ప్రముఖుల శుభాకాంక్షలు

సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తుందని రేవంత్‌ తెలిపారు.

Tags

Next Story