Chittoor : భూవివాదం.. నిలిచిపోయిన అంత్యక్రియలు..

Chittoor : భూవివాదం.. నిలిచిపోయిన అంత్యక్రియలు..
Chittoor : తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఓ తనయుడు తల్లఢిల్లిపోతున్నాడు. బరువెక్కిన గుండెలతో.. తడిసిన కన్నులతో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు

Chittoor : తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఓ తనయుడు తల్లఢిల్లిపోతున్నాడు. బరువెక్కిన గుండెలతో.. తడిసిన కన్నులతో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. సొంత పొలంలేనే అంత్యక్రియలు జరగాలన్న నాన్న కోరికకు భూవివాదం అడ్డుపడుతోంది. తండ్రి మృతదేహాన్ని కళ్లముందు పెట్టుకొని నిస్సాహయుడిగా ఉండిపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో విన్నవించుకుంటున్నాడు.

చిత్తూరు జిల్లా సోమల మండలం తమ్మినాయనపల్లెకు చెందిన కృష్ణారెడ్డి కుటుంబం చెరుకువారి పల్లెలో మూడేళ్ల కిందట 71 సెంట్ల భూమిని పద్మావతమ్మ వద్ద కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయి. కానీ కొందరు ఆ భూమిని కబ్జా చేశారు. పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. ప్రయోజనం శూన్యం. ఈ లోపు కృష్ణారెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు. నాన్న చివరి కోరిక మేరకు ఆ భూమిలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు తనయుడు రవి ప్రయత్నించాడు. ఖననం చేసేందుకు గొయ్యి తీస్తుండగా ప్రత్యర్థులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో నాన్న చివరి కోరిక తీర్చలేకపోతున్నానని రవి కుమిలిపోతున్నాడు.

రవి బాధను చూడలేక తన తనయుడు 8వ తరగతి చదవుతున్న తరుణ్ ఎస్పీకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. గ్రామానికి వచ్చి ఎస్సైని పంపించాడు. అయితే ఆ భూవివాదం కోర్టులో ఉందని ఏమీ చేయలేమని వెళ్లిపోయాడు ఆ ఎస్సై. తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేవరకు అంత్యక్రియలు నిర్వహించమని రవి వెల్లడించారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబమంతా విషం తాగి చనిపోతామని కన్నీటి పర్యాంతమయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story