NTR Health University: ఏపీలో హాట్ టాపిక్‌.. ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ పేరు మార్పు

NTR Health University: ఏపీలో హాట్ టాపిక్‌.. ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ పేరు మార్పు
NTR Health University: వైద్య విద్యకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలన్న లక్ష్యంతో వర్సిటీని స్థాపించిన ఎన్టీఆర్‌ పేరు కాదని.... జగన్‌ సర్కార్‌ వైఎస్సార్‌ పేరు పెట్టడం తాజా వివాదానికి కారణమైంది.

NTR Health University: వైద్య విద్యకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలన్న లక్ష్యంతో వర్సిటీని స్థాపించిన ఎన్టీఆర్‌ పేరు కాదని.... జగన్‌ సర్కార్‌ వైఎస్సార్‌ పేరు పెట్టడం తాజా వివాదానికి కారణమైంది. 1986లో హెల్త్ వర్సిటీ ప్రారంభమవగా...1998లో ఎన్టీఆర్ మరణాంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించడంతో ఏపీలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ పేరు మార్పు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. డాక్టర్‌ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ మంత్రి విడుదల రజిని ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అప్పట్లో రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలన్ని ఆయా జిల్లాల యూనివర్శిటీల పరిధిలోనే ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల ప్రదానం జరిగేది. ఐతే 1983లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.....వైద్య విద్యకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలని ఆకాంక్షించారు. తమిళనాడు, కర్ణాటక యూనివర్శిటీలను పరిశీలించి...మెడికల్ ఎడ్యుకేషన్‌ కోసం ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉండాలని నిర్ణయించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ వారికి అందుబాటులో ఉండేలా విజయవాడలో హెల్త్‌ వర్సిటీ ఏర్పాటు చేశారు. 1986 ఏప్రిల్‌లో వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభం కాగా...1986 నవంబర్‌ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ పేరిట ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఆ రోజుల్లో విజయవాడ సిద్దార్థ మెడికల్‌ కాలేజ్‌ ప్రైవేట్ కళాశాలగా ఉండేది. మెడికల్, డెంటల్‌, నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలలైన 26 సంస్థలను కలిపి యూనివర్శిటి కార్యకలాపాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో వైద్య విద్య కోర్సుల కాలేజీలు, వాటి అనుబంధ కాలేజీలు పెరగడంతో 2000 సంవత్సరం నవంబర్‌ 1న విశ్వవిద్యాలయాన్ని సిద్దార్థ మెడికల్ కాలేజీ నుంచి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌లోకి మార్చారు. ఎన్టీఆర్ మరణాంతరం చంద్రబాబు హయాంలో 1998 జనవరి 8న స్పెషల్‌ గెజిట్ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీగా మార్చారు.

తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సైతం ఎన్టీఆర్‌ పేరుకు ముందు డాక్టర్ చేర్చారు. ఇందుకు అనుగుణంగా 2006 జనవరి 8న డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పేరు మార్చారు. 2001లో యూనివర్శిటీ రజతోత్సవం సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న పురందేశ్వరీ..వర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఆవిష్కరించారు.

ప్రస్తుతం సిద్దార్థ మెడికల్ కాలేజీ ఆవరణలోని రెండెకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ యూనివర్సిటీకి సంబంధించిన 400 కోట్ల రూపాయలను ఇటీవలే జగన్ సర్కార్ లాగేసుకుంది.


Tags

Read MoreRead Less
Next Story