Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌లు రెడ్డి కుమారుడిని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. మాగుంట రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నిన్న మాగుంట రాఘవను ఈడీ ఆఫీస్‌కు పిలిచి రాత్రి 8గంటల వరకు ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం రాఘవను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈడీ అధికారులు రాఘవను కస్టడీ కోరనున్నారు. గతంలోనూ మాగుంట ఆఫీసులు, నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏపీలో ఇది తొలి అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మొత్తం 32 రిటైల్ జోన్లు ఉండగా ఇందులో సౌత్ గ్రూప్ 9 జోన్స్ దక్కించుకుంది. ఇందులోని 2 జోన్సులలో మాగుంట రాఘవ రెడ్డి వ్యాపారం చేశారు. ఈ 2 జోన్లలో మాగుంట రాఘవరెడ్డికి చెందిన మాగుంట ఆగ్రో ఫామ్స్ లిమిటెడ్ పేరుతో బిజినెస్ చేశారు. మాగుంట రాఘవరెడ్డిని భాగస్వాములుగా పేర్కొన్న ఈడీ రాఘవ పాత్ర ఉందని ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లో అభియోగాలు మోపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com