Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10రోజుల కస్టడీ

Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10రోజుల కస్టడీ
ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసిన ఈడీ, సీబీఐ

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వరుసగా అరెస్టులు చేస్తున్న ఈడీ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌రెడ్డి అరెస్టు చేసిన ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 10 రోజుల కస్టడీకి అనుమతించారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ బృందాలు ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశాయి. వారిలో రాఘవ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్‌ వ్యాపారి అభిషేక్‌ బోయినపల్లి, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ పి.శరత్‌చంద్రారెడ్డి, ఆడిటర్‌ బుచ్చిబాబు ఉన్నారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మేకింగ్‌లో రాఘవ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ స్కాంలో మాగుంట రాఘవ ప్రమేయాన్ని రిమాండ్ రిపోర్టులో ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాగుంట రాఘవ కీలక భాగస్వామి అని, 180 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో రాఘవ ప్రమేయం ఉందని ఈడీ తెలిపింది. హోల్ సేల్ కంపెనీ ఇండోస్పిరిట్ లో రాఘవ పార్టనర్ అని తెలిపింది. మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్స్ ఉన్నాయని వివరించింది.

ఇక ఢిల్లీలిక్కర్‌ స్కాం కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి కవిత పేరును యాడ్ చేశారు ఈడీ అధికారులు. మూడు రోజుల క్రితం ఈ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు ఢిల్లీ సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ వంద కోట్లు ఇచ్చిందని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్ లో తెలిపింది. పార్టీల్లోని పెద్ద నేతల బినామీల ద్వారా ఈ స్కాంలో ఆయన పాల్గొన్నారని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ, శరత్ చంద్రారెడ్డి ఉన్నట్టు తెలిపింది. ఇండోస్పిరిట్ సంస్థలో కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించాడని,ఆయన్ని విచారించిన సమయంలో మాగుంటకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయని ఈడీ రిపోర్ట్ తెలిపింది. కేజ్రీవాల్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిసినట్టు అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇచ్చాడని ఈడీ క్లారిటీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story