Pawan Kalyan: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన పవన్‌

Pawan Kalyan: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన పవన్‌
X
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.. ఇక, కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌.. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు.. ఇది ఆనందించే సమయం కాదు.. స్వాతంత్య్ర సమర యోధులను గుర్తించాలి.. 78 ఏళ్ల క్రితం ఇదే సమయానికి తెలంగాణ, పంజాబ్ కి స్వాతంత్య్రం రాలేదని గుర్తుచేశారు..రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహం ముందుకు వెళ్తున్నాం.. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టుకున్నాం.. పేద వారి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసే క్యాంటీన్ లకు ఎన్టీఆర్ పేరు పెట్టామని తెలిపారు.

ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ప్రజా సంపదన దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించిన ఆయన.. గత ఐదేళ్లు లా అండ్ ఆర్డర్ క్షీంచింది, స్కూల్ కి వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదు.. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎక్కడ రాజీ పడకూడదన్నారు.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి విచ్చలవిడి గా మాట్లాడితే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయ్యింది.. శేషా చలం అడవులు లో కొట్టేసిన ఎర్ర చందనం కర్ణాటకలో అమ్ముకున్నారు అని విమర్శించారు.. డిప్యూటీ సీఎంగా నాకు కొన్ని పరిధిలు ఉంటాయి.. కొత్త తరం నాయకులని తయారు చేసుకోవాలి.. మాటలలో కాదు చేతలతో చూపిస్తం అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇంకా పవన్‌ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Tags

Next Story