విజయవాడలో సీతమ్మ విగ్రహ ధ్వంసంపై అగ్రహ జ్వాలలు

విజయవాడలో సీతమ్మ విగ్రహ ధ్వంసంపై అగ్రహ జ్వాలలు
X
విజయవాడ పండిట్‌ నెహ్రూ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగంలోని ఆలయంలో సీతమ్మ విగ్రహ ధ్వంసంపై అగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ పండిట్‌ నెహ్రూ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగంలోని ఆలయంలో సీతమ్మ విగ్రహ ధ్వంసంపై అగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి హిందూ సంఘాల ప్రతినిధులు, టీడీపీ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. మందిరానికి పెద్ద సంఖ్యలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, టీడీపీ నేతలు చేరుకుంటున్నారు. సీతారామ ఆలయం ఎదుట హిందూ పరిరక్షణ సమితి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీతమ్మ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అటు ఏపీలో ఆలయాలపై వరుసగా దాడులు జరగడం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం వల్లే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి ఇంటికి అతి సమీపంలోని మందిరంపై దాడి జరిగిందని అన్నారు. దాడిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story