అప్పుకోసం లక్షల మంది రైతులకు మెడకు ఉరితాడు వేస్తారా? : దేవినేని ఉమ ఆగ్రహం

అప్పుకోసం లక్షల మంది రైతులకు మెడకు ఉరితాడు వేస్తారా? : దేవినేని ఉమ ఆగ్రహం
రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చే దమ్ములేక... కేంద్రం వద్ద అప్పుల కోసం వ్యవసాయ పంప్‌సెట్ల విద్యుత్ మీటర్లు అమర్చడం సరైన..

రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చే దమ్ములేక... కేంద్రం వద్ద అప్పుల కోసం వ్యవసాయ పంప్‌సెట్ల విద్యుత్ మీటర్లు అమర్చడం సరైన పద్ధతి కాదన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ. కృష్ణా జిల్లా జి.కొండూరులో పసుపు చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవినేని.. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్కడి వ్యవసాయ భూముల్లో పర్యటిస్తూ... రైతులతో మాట్లాడారు. ఈ రోజు మీటర్లు అమరుస్తారు.. రేపు స్లాబ్‌లు వేస్తారని మండిపడ్డారు. సంపద సృష్టించడం చేతకాక.. అప్పుల కోసం రాష్ట్రాన్ని రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. అప్పుల కోసం లక్షల మంది రైతులకు మెడకు ఉరితాడు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story