13 జిల్లాల పేకాట కేంద్రానికి కొడాలి నానిని అధ్యక్షుడిని చేస్తారా? : దేవినేని ఉమ

13 జిల్లాల పేకాట కేంద్రానికి కొడాలి నానిని అధ్యక్షుడిని చేస్తారా? : దేవినేని ఉమ
బాధ్యత గల కేబినెట్‌ మంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

13 జిల్లాల పేకాట కేంద్రానికి మంత్రి కొడాలి నానిని అధ్యక్షుడిని చేస్తారా? అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమ. బాధ్యత గల కేబినెట్‌ మంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా అని ప్రశ్నించారు. పేకాట ఆడితే ఉరితీస్తారా అని కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. పంపకాల్లో తేడా వచ్చిన తర్వాత పోలీసులు వెళ్లారని అన్నారు. పట్టుకున్న డబ్బంతా తాడేపల్లి రాజ ప్రసాదానికి వెళ్లిందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఈ భాష మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నానిని బర్తరఫ్‌ చేసే ధైర్యం జగన్‌కు ఉందా..? అని సవాల్‌ విసిరారు. నీ కేబినెట్‌ మంత్రి విచ్చలవిడిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే.. ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా..? అని నిప్పులు చెరిగారు దేవినేని ఉమ. వాటాల్లో తేడా వచ్చింది కాబట్టే పేకాట దందా బయటికొచ్చిందన్నారు దేవినేని ఉమ.

Tags

Read MoreRead Less
Next Story