DEWANSH:వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా దేవాన్ష్

సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. వరల్డ్ స్థాయి అవార్డ్‌ను అందుకున్నారు. ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్‌గా నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో దేవాన్ష్‌కు నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు. గతేడాది చెక్‌మేట్ మారథాన్‌లో 175 చెక్‌మేట్ సవాళ్లను పరిష్కరించి దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. చెస్ డొమైన్లో గతంలోనూ మరో రెండు రికార్డులు సాధించారు. దేవాన్ష్ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణమని అతడి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్ష్ చెస్ నేర్చుకున్నాడని చెప్పారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నాని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ మనవడు దేవాన్ష్‌ను అభినందించారు. "చెస్ గేమ్‌లో అత్యంత వేగంగా చెక్‌మేట్ పజిల్స్‌ను ఛేదించిన వ్యక్తిగా దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మొత్తం 175 పజిల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, "మా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 అందుకోవడం గర్వంగా ఉంది" అని తెలిపారు. చెస్ డొమైన్లో గతంలోనూ మరో రెండు రికార్డులు సాధించారు. దేవాంశ్ సాధించి-న ఈ ఘనత ఎంతో గర్వకారణమని అతడి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాంశ్ చెస్ నేర్చుకున్నాడని చెప్పారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నానని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com