ఎస్సై శిరీషకు డీజీపీ సెల్యూట్!

శ్రీకాకుళం జిల్లాలో మానవత్వం చాటుకున్న మహిళా ఎస్ఐకి అరుదైన గుర్తింపు లభించింది. గుర్తుతెలియని శవాన్ని మోసి దనహ సంస్కారాలు నిర్వహించిన ఎస్సై శిరీష గురించి పోలీసు శాఖ మొత్తం చర్చించుకుంటోంది. ఆమె సేవలకు గుర్తుగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా సత్కరించారు. ఎస్సై శిరీషను చూడగానే ఆమెకు డీజీపీ సెల్యూట్ చేశారు. అనంతరం బ్యాడ్జ్‌తోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఎస్సై శిరీషకు డీజీపీ సెల్యూట్‌కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అడవికొత్తూరు గ్రామంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ శిరీష.. డెడ్ బాడీని స్వయంగా కిలోమీటర్ దూరం వరకు మోసుకొచ్చారు.లలితా చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు.
మహిళా ఎస్‌ఐ అనాథ శవాన్ని మోసి, దహన సంస్కారాలు నిర్వహించడంతో స్థానికులతోపాటు డిపార్ట్‌మెంట్ అధికారులు అభినందించారు. అయితే స్థానికులను, తోటి సిబ్బందిని ఇబ్బంది పెట్టకూడదనే తాను ఆశవాన్ని మోసుకొచ్చినట్లు ఎస్‌ఐ శిరీష తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com