Digvijayabheri: వారాహిపై బందర్‌కు బయలెల్లిన జనసేనాని

జనసేన ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ విజయవాడ నుంచి బయలు దేరారు. వారాహిలో ఆటో నగర్ నుంచి పవన్ బయలెల్లారు. అయితే మంగళవారం సాయంత్రం 5గంటలకు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావసభ. దిగ్విజయభేరి పేరుతో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీంతో ఆంధ్రా, తెలంగాణ నుంచి జనసేన శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. సభా స్థలంలో లక్షా 20వేల మంది కూర్చునేలా గ్యాలరీ ఏర్పాటు చేశారు. రెండ వేల మందితో వాలంటీర్ వ్యవస్థ నియమించారు. కాగా మచిలీపట్నం నుంచి జనసేనాని ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఈ సభలో పవన్ ఏం మాట్లాడుతారు, మేనిఫెస్టో ప్రకటిస్తారా, ప్రచారంలో వారాహి రూట్‌మ్యాప్ ఎలా ఉండబోతోందని, ఎన్నికలకై పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్ధేశం చేయనున్నారని అలాగే పొత్తులపై క్లారిటీ ఇస్తారా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com