RGV: విచారణకు హాజరైన ఆర్జీవీ

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో ఆర్జీవీని పోలీసులు విచారిస్తున్నారు. గతేడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇటీవల ఫిబ్రవరి 4న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈనెల 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. విచారణకు రావాలని అధికారులు పలుమార్లు నోటీసు ఇచ్చినా పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన ఆర్జీవీ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు.
ఆర్జీవీని కలిసిన వైసీపీ నేత
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ’వ్యూహం’ సినిమాలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లను వక్రీబవిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దానికి మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు నేడు ఆర్జీవీ మద్దిపాడు రావడంతో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై చర్చజరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com