ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో అపశ్రుతి!

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో అపశ్రుతి!
విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇంటి పట్టా అందుకునేందుకు గుంకలాం వెళ్లిన లబ్ధిదారుడు అస్వస్థతతో మృతి చెందాడు.

విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇంటి పట్టా అందుకునేందుకు గుంకలాం వెళ్లిన లబ్ధిదారుడు అస్వస్థతతో మృతి చెందాడు. మృతుడు విజయనగరంలోని అవనాపు వీధికి చెందిన సత్తిబాబుగా గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం హడావిడి చేసిన అధికారులు.. లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఎండ తీవ్రతను తట్టుకోలేక సత్తిబాబు చనిపోయాడని అక్కడికొచ్చిన వారు అంటున్నారు.. 70 ఏళ్ల వృద్ధుడని కూడా చూడకుండా వాలంటీర్‌ అటూ ఇటూ తిప్పడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story