Yuvagalam: లోకేష్‌కు MRI స్కాన్‌ చేసిన వైద్యులు

Yuvagalam: లోకేష్‌కు MRI స్కాన్‌ చేసిన వైద్యులు
యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడున్నారు. దీంతో ఇవాళ స్కానింగ్ చేయించుకున్నారు

యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడున్నారు. దీంతో ఇవాళ స్కానింగ్ చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ వ్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లో లోకేష్ కుడి భుజానికి MRI పరీక్షలు చేశారు వైద్యులు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైంది. గత 50 రోజులుగా లోకేష్ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. భుజం నొప్పి అధికంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా నొప్పి తగ్గకపోడవంతో గురువారం MRI స్కానింగ్ చేయించుకున్నారు.

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర... 103 రోజులుగా సాగుతోంది. అశేష జనవాహిని మధ్య ఈ పాదయాత్ర చేస్తున్నారు. నారా లోకేష్‌కు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. తనకు భుజం నొప్పి ఉన్నా... గత 50 రోజులుగా పాదయాత్ర చేస్తునే ఉన్నారు లోకేష్. అన్నీవర్గాల ప్రజలు కలిసి నడుస్తున్నారు. ఇవాళ 1300 కి.మీ మైలు రాయిని సైతం పూర్తి చేయనున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్.. దారి పొడువునా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. హామీలు ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. జై లోకేష్‌.. జై టీడీపీ నినాదాలతో లోకేష్‌ పాదయాత్ర పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story