ఈ ముఖ్యమంత్రికి కళ్లు, చెవులు ఉన్నాయా? : టీడీపీ అధినేత చంద్రబాబు

కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా వారి బంధువులపై ఇంకా ఈ ప్రభుత్వం వేధింపులు ఆపడం లేదని మండిపడ్డారు.. కావాలనే టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు.. పనికిమాలిన రాజకీయాలతో రాష్ట్రంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తమ ఆస్తులకు భద్రత లేదని రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు.. అసలు ఈ ముఖ్యమంత్రికి కళ్లు, చెవులు ఉన్నాయా అంటూ నిలదీశారు.. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉదాసీతన ప్రజల్లో అభద్రతను పెంచుతూ ఆత్మహత్యలను ప్రేరేపిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఘటనకు కారణమైన అధికారులకు డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజానికి నమ్మకం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించకుంటే ఇంకా ఈ తరహా ఘటనలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com