GAS: గ్యాస్ "ట్రబుల్స్"

GAS: గ్యాస్ ట్రబుల్స్
X
మన వంటింటి వరకూ ;చేరుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మంట

ఇరాన్-ఇజ్రాయెల్ సెగ మన వంటింటి వరకూ చేరింది. గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. హాస్టళ్లు మెనూను కోసేస్తున్నాయ్. ఏజెన్సీలో బుకింగ్స్‌లో గడువు నిర్దేశిస్తున్నాయ్. సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలు బారులు తీరుతున్నాయ్. మొత్తంగా దేశంలో గ్యాస్ కష్టాలు రెట్టింపయ్యాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో కేంద్రం రంగంలోకి దిగి నాలుగు ప్రాథమిక రంగాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తామని ఆదేశాలు జారీ చేసింది.

పశ్చి­మా­సి­యా­లో ఉద్రి­క్త­త­లు తీ­వ్ర­రూ­పం దా­ల్చ­డం­తో ఏర్ప­డిన అం­త­ర్జా­తీయ పరి­ణా­మా­లు ఇప్పు­డు దే­శీయ వ్యా­పార రం­గా­ల­పై కూడా ప్ర­భా­వం చూ­పు­తు­న్నా­యి. ము­ఖ్యం­గా ఇరా­న్‌­కు సం­బం­ధిం­చిన యు­ద్ధ పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో గల్ఫ్ దే­శాల నుం­చి చము­రు, గ్యా­స్ సర­ఫ­రా­లో అం­త­రా­యం ఏర్ప­డ­టం­తో దే­శం­లో కమ­ర్షి­య­ల్ ఎల్పీ­జీ సి­లిం­డ­ర్ల కొరత నె­ల­కొం­ది. ఈ ప్ర­భా­వం తె­లం­గా­ణ­లో­ని హో­ట­ల్, రె­స్టా­రెం­ట్ రం­గం­పై తీ­వ్రం­గా పడు­తోం­ది. గ్యా­స్ సర­ఫ­రా తగ్గి­పో­వ­డం­తో అనేక హో­ట­ళ్లు, రె­స్టా­రెం­ట్లు కా­ర్య­క­లా­పా­ల­ను కొ­న­సా­గిం­చ­డం­లో ఇబ్బం­దు­లు ఎదు­ర్కొం­టు­న్నా­యి. పరి­స్థి­తి ఇలా­గే కొ­న­సా­గి­తే మరి­కొ­ద్ది రో­జు­ల్లో అనేక హో­ట­ళ్లు మూ­త­ప­డే పరి­స్థి­తి ఏర్ప­డు­తుం­ద­నే ఆం­దో­ళన వ్య­క్త­మ­వు­తోం­ది. తెలంగాణలో నెలకు సుమారు ఎనిమిది లక్షల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగం ఉండగా, ఈ రంగం దాదాపు రూ.150 కోట్ల మార్కెట్‌గా విస్తరించి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల వరకు కమర్షియల్ సిలిండర్లు వినియోగంలో ఉంటాయి. అయితే ఇటీవల గ్యాస్ సరఫరా తగ్గుముఖం పట్టడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూలను పరిమితం చేసి గ్యాస్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే మరికొద్ది రోజుల్లోనే అనేక హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

కీలక నిర్ణయాలు

ఈ పరి­ణా­మాల నే­ప­థ్యం­లో తె­లం­గాణ హో­ట­ల్స్ అసో­సి­యే­ష­న్ ఆధ్వ­ర్యం­లో సి­కిం­ద్రా­బా­ద్‌­లో అత్య­వ­సర సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. గ్యా­స్ సర­ఫ­రా పరి­స్థి­తి­పై సభ్యు­లు చర్చిం­చి భవి­ష్య­త్ చర్య­ల­పై ఆలో­చిం­చా­రు. పరి­స్థి­తి మె­రు­గు­ప­డ­క­పో­తే రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా హో­ట­ళ్లు బంద్ చే­యా­ల్సి వచ్చే పరి­స్థి­తి ఏర్ప­డు­తుం­ద­ని సంఘం నా­య­కు­లు హె­చ్చ­రిం­చా­రు. హో­ట­ల్ రం­గం­పై ఆధా­ర­ప­డి జీ­వి­స్తు­న్న లక్ష­లా­ది మంది కా­ర్మి­కుల భవి­ష్య­త్తు ప్ర­మా­దం­లో పడే అవ­కా­శ­ముం­ద­ని వారు ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. దే­శా­ని­కి అవ­స­ర­మైన ఎల్పీ­జీ సర­ఫ­రా­లో దా­దా­పు 62 శాతం వరకు ది­గు­మ­తు­ల­పై ఆధా­ర­ప­డు­తుం­ది. అయి­తే పశ్చి­మా­సి­యా­లో యు­ద్ధ పరి­స్థి­తు­లు నె­ల­కొ­న­డం­తో హా­ర్ము­జ్ జల­సం­ధి­లో నౌకల రా­క­పో­క­లు ప్ర­భా­వి­త­మ­య్యా­యి. దీం­తో భా­ర­త్‌­కు గ్యా­స్ ది­గు­మ­తు­లు ని­లి­చి­పో­యా­యి. అదే­వి­ధం­గా సౌదీ అరే­బి­యా, ఖతా­ర్ వంటి దే­శాల నుం­చి కూడా సర­ఫ­రా­లో అం­త­రా­యం ఏర్ప­డిం­ది. ఈ పరి­స్థి­తు­ల్లో కేం­ద్ర ప్ర­భు­త్వం తా­త్కా­లి­కం­గా కమ­ర్షి­య­ల్, ఇం­డ­స్ట్రి­య­ల్, ఆటో­మొ­బై­ల్ రం­గా­ల­కు ఎల్పీ­జీ సర­ఫ­రా­ను తగ్గిం­చి­న­ట్లు సమా­చా­రం. అయి­తే దీ­ని­పై అధి­కా­రిక ప్ర­క­టన చే­య­క­పో­యి­నా గృహ వి­ని­యో­గ­దా­రు­ల­కు ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని ఆయి­ల్ మా­ర్కె­టిం­గ్ సం­స్థ­ల­కు సూ­చిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. గృహ వి­ని­యో­గ­దా­రుల అవ­స­రా­ల­ను ముం­దు­గా తీ­ర్చా­ల­ని కేం­ద్రం సూ­చిం­చి­న­ట్లు సమా­చా­రం.

Tags

Next Story