12 Oct 2021 12:30 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / Dr. Sudhakar: డాక్టర్‌...

Dr. Sudhakar: డాక్టర్‌ సుధాకర్ తల్లి ఇంట్లో మేనల్లుడి బెదిరింపు..

Dr. Sudhakar: విశాఖలో ఇటీవలే మృతిచెందిన డాక్టర్ సుధాకర్ తల్లి నివసిస్తున్నఇంట్లో హైడ్రామా చోటుచేసుకుంది.

Dr. Sudhakar: డాక్టర్‌ సుధాకర్ తల్లి ఇంట్లో మేనల్లుడి బెదిరింపు..
X

Dr. Sudhakar: విశాఖలో ఇటీవలే మృతిచెందిన డాక్టర్ సుధాకర్ తల్లి నివసిస్తున్నఇంట్లో హైడ్రామా చోటుచేసుకుంది. సుధాకర్‌ తల్లి కావేరిభాయ్ ఇంట్లో ఆమె మేనల్లుడు చొరబడి హల్‌చల్ చేశాడు. తనకు రావాల్సిన ఆస్తిని కావేరిభాయ్‌ కాజేశారంటూ... విజయ్ హంగామా చేశాడు. గదిలోపల గడియపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.

మేనల్లుడు విజయ్‌ తీరుపై కావేరిభాయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం బెదిరింపులకు దిగుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కావేరిభాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌తో తనకు ప్రాణభయం ఉన్నట్లు తెలిపారు. ప్రముఖులతో కలిసి మేనల్లుడు తమ భూముల్ని కాజేశాడని ఆరోపించారు కావేరిభాయ్

Next Story